ఈ సినిమా ద్వారా జూ ఎన్టీఆర్‌ను టాలీవుడ్‌లో తిరుగులేని యాక్షన్ హీరోగా మార్చేందుకు ట్రైచేస్తున్నాడు దర్శకుడు. ఇందుకోసం హీరోతో టెర్రిఫిక్ ఫైటింగ్ సీన్లు చేయిస్తున్నాడు. స్టంట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఈ సినిమా కోసం రొటీన్ కు భిన్నమైన, ప్రేక్షకులు కళ్లు తిప్పుకోలేని విధంగా భయంకరమైన ఫైటింగ్ సన్నివేశాలు కంపోజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ దమ్ము షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది.
ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్‌తో త్రిష, కార్తీక తొలిసారి జతకడుతున్నారు. అలెగ్జాండర్ వల్లభ క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కె.ఎస్. రామారావు సమర్పకులు. 2012 వేసవి వరకు ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.