పవన్ కళ్యాణ్ హీరోగా
ఇటీవల విడుదలైన ‘పంజా’ సినిమా అనుకున్న అంచనాలను అందుకోక పవన్ కళ్యాణ్
అభిమానులతో పాటు....నిర్మాతలను నిరాశ పరిచిన విషయం తెలిసిందే. అయితే పవన్
గత సినిమాల కంటే స్టయిలిష్ గా ఉండటంతో యావరేజ్ టాక్ సరిపెట్టుకుంది ఈ
సినిమా. ముఖ్యంగా...భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు ఆశించి వసూళ్లు
రాలేదని ఫిల్మ్ నగర్ టాక్. ఈ నేపథ్యంలో పంజా ప్రొడ్యూసర్స్ ను ఆదుకునేందుకు
వారితో కలిసి మరో సినిమా చేసేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
తమిళ
దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించిన పంజా చిత్రంలో....సారాజేన్
డియాస్, అంజలి లవానియాలు నటించారు. జాకీష్రాఫ్ మెయిన్ విలన్ గా నటించి ఈ
చిత్రంలో అడవి శేష్ విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. యువర్ శంకర్ రాజా
అందించిన సంగీతం సినిమాకు ప్రాణం పోసింది.
ప్రస్తుతం పవన్ కళ్యాన్
గబ్బర్ సింగ్ షూటింగుతో బిజీగా గడుపుతున్నాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్
నటిస్తోంది. హారిస్ శంకర్ దర్వకత్వం వహిస్తున్న ఈ సినిమాకు బండ్ల గణేష్
బాబు నిర్మాత.
Share this