Pawan Fans Ku Harish Shankar Warning

Harish Shankar
పవన్ కళ్యాణ్ తో ప్రస్తుతం గబ్బర్ సింగ్ చిత్రం చేస్తున్న హరీష్ శంకర్ ట్విట్టర్ లో ఫ్యాన్స్ తో ఓ రేంజి యుద్దం చేస్తున్నాడు. ఆయన రీసెంట్ గా ట్వీట్ చేస్తూ... పవర్ స్టార్ దేముడు నాకు.. అలాగే అతని ఫ్యాన్స్ అంతా నాకు బ్రదర్స్. కానీ తప్పుగా మాట్లాడితే, తమ్ముడైనా... అన్న అయినా సహించేది లేదు..ఫ్యాన్స్ అందరూ నాకు బ్రదర్స్..బాదర్స్ లా బిహేవ్ చెయ్యద్దు అన్నారు. అలాగే మీకు ట్విట్టర్ లో మాత్రమే దూలేమో, నాకు నరనరాల్లో... అంటూ మిరపకాయలోని డైలాగుని ఉదహరిస్తూ ఫ్యాన్స్ కు పంచ్ వేసారు. అంతేగాక ..కౌంట్ గురించో,ఎక్కౌంట్ గురించో నేను ట్విట్టర్ లో లేను..ఫాలోవర్స్ ని పెంచుకోవటం కంటే బ్లాక్ చెయ్యటమే నాకు కిక్ అన్నారు.

ఆయన ట్విట్టర్ ఎక్కౌంట్ లో కొందరు.. ఫవన్ అభిమానులుమని ట్వీట్ చేస్తూ...షాక్ అనే కళా ఖండం తర్వాత ఐదు సంవత్సరాలకి కంటెంట్ లేక అది వీడి వీపి రేంజ్ అని, కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు పవన్ వీడికి ఛాన్స్ ఇచ్చాడు. దానికి వీడు రెచ్చిపోతున్నాడు.. అంటూ హరీష్ ని రెచ్చగొట్టే విధంగా ట్వీట్స్ చేసారు. దానికి ఆయన కౌంటర్ గా ఇలా సమాధానం ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో రూపొందుతన్న చిత్రం 'గబ్బర్‌ సింగ్‌'. ఈ చిత్రం షూటింగ్ రీసెంట్ గా.. పొలాచ్చి లో పూర్తి చేసుకు వచ్చింది. అక్కడ హీరో,హీరోయిన్స్ పై ఓ పాటను షూట్ చేసుకుని వచ్చారు. జనవరి 2 నుంచి హైదరాబాద్‌లో కొన్ని కీలక ఘట్టాలు తెరకెక్కిస్తారు. ఈ చిత్రంలో పవన్‌ తల్లిగా సుహాసిని నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.దబాంగ్ రీమేక్ గా రూపొందుతోన్న గబ్బర్ సింగ్ చిత్రాన్ని నిర్మాత గణేష్ బాబు.. ఎట్టి పరిస్దితుల్లోనూ అనుకున్న తేదీకే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్, సుహాసిని, అభిమన్యు సింగ్, నాగినీడు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 28వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

Share this

Related Posts

Previous
Next Post »